మోదీ – ట్రంప్ భాయి భాయి

కరోనాపై విజయం సాధించేందుకు ఇరు దేశాలు ఉమ్మడిగా పోరాటం చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదివరకే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ ద్వారా తెలిపిన విషయం మనకు తెలిసినదే. ఆ తర్వాత ట్రంప్ మోదీని హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను కోరడం, వాటిపై ఎగుమతి నిషేధం అమలులో ఉండటంతో మోదీపై ట్రంప్ సీరియస్ అయ్యారు.

భారత్ కనుక హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔషధాన్ని అమెరికాకు సరఫరా చేయకుంటే భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలో.. హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔషధంపై ఎగుమతిపై నిషేధాన్ని భారత్ సడలించడంతో ప్రధాని మోదీకి ట్రంప్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను అంటూ ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ ‘అద్భుతమైన నాయకుడు’, ఇలాంటి కష్ట కాలంలో భారత్ చేసిన సాయం ‘ఎప్పటికీ మర్చిపోలేనిది’ అంటూ మోదీని ప్రశంసలతో ముంచెత్తారు ట్రంప్. అయితే భారత నెటిజెన్లు మాత్రం హైడ్రాక్సీక్లోరోక్వీన్ విషయంలో ట్రంప్ వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నారు. మాత్రలు ఇవ్వకపోతే ప్రతీకారం తీర్చుకోవటం ఇస్తే మీరు మేము భాయి భాయి అనటం ఏం బాగోలేదని అంటున్నారు.

trump-modi