మాస్క్ లేకపోతే రూ.1,000 ఫైన్

మాస్క్ ధరించకుండా బయట కనిపించినట్లయితే రూ.1,000 ఫైన్ విధిస్తామంటున్నారు గుంటూరు జిల్లా పోలీసులు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం కరోనా కేసుల్లో గుంటూరు జిల్లా అత్యధికంగా 49 కేసులతో ద్వితీయ స్థానంలో ఉన్న నేపథ్యంలో, కరోనా కట్టడి చర్యలను మరింత కఠినతరం చేశారు.

జిల్లాలో కేసులు అనూహ్యంగా పెరిగిపోవడంతో లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేశామని, మాస్క్ లేకుండా ఎవరైనా బైటకొస్తే రూ.1,000 జరిమానా విధిస్తామని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ హెచ్చరించారు. అధికారులైనా, ఉద్యోగులైనా, సామాన్య ,ప్రజలైనా ఎవరైనా సరే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెప్పారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, నిత్యావసర సరుకుల కొనుగోలు సమయాన్ని కూడా తగ్గించారు. ఇప్పుడు కేవలం ఉదయం 6 గంటలనుంచి 9 గంటల లోపు మాత్రమే నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రజలు బయటకు రావాలని, ప్రత్యేక అనుమతితో బయటకు వచ్చే ఉద్యోగులకు కూడా ఇదే సమయాన్ని పాటించాలని కోరారు.

mask

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s