హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్లో సెక్యూరిటీ సిబ్బంది చేసిన ఓవరాక్షన్ మంత్రి కేటీఆర్ వరకూ చేరింది. మణిపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు చూడటానికి చైనా వాళ్ల మాదిరిగా ఉన్నారంటూ వారిని లోపలకి అనుమతించలేదు. దీంతో ఆ వ్యక్తులు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా కేటీఆర్ సార్ వరకూ వెళ్లింది.
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్న ఇద్దరు వ్యక్తులు ఆ సూపర్ మార్కెట్‌కు సరుకుల కొనుగోలు కోసం వెళ్లారు. కనీసం వారి టెంపరేచర్స్ కూడా చెక్ చేయకుండా, వారి రూపురేఖలు చూసి వారిపై వివక్ష చూపే ప్రయత్నం చేశారు సెక్యూరిటీ గార్డ్. తాము మణిపూర్‌కి చెందిన వారేనని, ఆధార్ కార్డు కూడా ఉందని తమని లోపలికి అనుమతించాలని వేడుకున్నా గార్డు కనికరించలేదు.
ఈ వీడియో కాస్తా మంత్రి కేటీఆర్ వరకూ చేరటంతో దీనిపై స్పందించిన ఆయన సూపర్ మార్కెట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు చూపినా పట్టించుకోకుండా వివక్ష చూపిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని డీజీపీకి ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
This is absolutely ridiculous and unacceptable. Racism in any form should be dealt with sternly
Request @TelanganaDGP Garu to instruct all Police Commissioners & Superintendents of Police to take up these issues seriously with retail association & send out a clear message https://t.co/A5WGxEyqbZ
— KTR (@KTRTRS) April 9, 2020