ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి ‘పుష్ప’ (P U S H P A) అనే పేరును పెట్టిన సంగతి మనకు తెలిసినదే. బుధవారం నాడు అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను క్లోజ్‌గా చూసినట్లయితే, ఇందులో అల్లు అర్జున్ ఎడమ కాలుకి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపిస్తాయి.
ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది. టైటిల్ పేరుపై ఫింగర్ ప్రింట్స్ ఉండటం, అల్లు అర్జున్‌కి కూడా ఆరు వేళ్లు ఉండటం చూస్తుంటే ఈ ఆరో వేలికి సినిమాకు పెద్ద లింకే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లలో అల్లు అర్జున్ క్రింద కూర్చుని ఉంటే వెనుక భాగంలో పోలీసులు, ఎర్ర చందనం దుంగలు కనిపిస్తాయి.
ఈ సినిమాలో బన్నీ పేరు పుష్పక్ నారాయణ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరికొందరైతే ఈ చిత్రంలో హీరోయిన్ పేరు పుష్ప అని, బన్నీ నడిపే లారీ పేరు కూడా పుష్ప అని అంటున్నారు. ప్రతినాయకుడి పాత్రలో తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. సేతుపతి ప్రేమించిన అమ్మాయి పేరు కూడా పుష్ప అయి ఉంటుదని, ఈ సినిమా కథ మొత్తం పుష్ప చుట్టూనే తిరుగుతుంటుందని అంటున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్, చిత్తూరు నేపథ్యంలో నడిచే సినిమా ఇది. పుష్ప చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది.