కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన లాక్డౌన్ కారణంగా తన భార్య నుంచి దూరమైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాధకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని రాధా కుండ్ ప్రాంతానికి చెందిన రాకేష్ సోనీ అనే 32 ఏళ్ల వ్యక్తి తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లాక్డౌన్ ప్రకటించడానికి ముందు రాకేష్ భార్య ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో ఆమె ఊరి నుంచి రాలేక, అక్కడే ఉండిపోయింది.
రాకేష్ కూడా భార్య వద్దకు వెళ్లడానికి అన్ని మార్గాలు మూసుకుపోవటంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.