డాక్టర్‍‌‌పై ఉమ్మిన కరోనా రోగి; హత్యాయత్నం కేసు

దేశంలో కరోనా రోగులు రోజురోజుకీ ఎక్కువవుతున్నారు. ఈనేపథ్యంలో కొందరు ఆకతాయిలు కరోనాను చాలా తేలికగా తీసుకుంటున్నారు. కరోనా వల్ల వారికి, వారి చుట్టూ ఉండే సమాజానికి పొంచి ఉన్న ముప్పును గుర్తించలేని మూర్ఖత్వంలో కొందరున్నారు. చికిత్స అందిస్తున్న వైద్యుడిపై ఓ కరోనా రోగి వైరస్‌ ఉమ్మి వేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంసమైంది.

వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తిరుచిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వార్డులో ఉన్న ఓ పేషెంట్‌ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వైద్యులకు సహకరించకపోగా వారిని పలు ఇబ్బందులకు గురిచేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన మాస్క్‌ను తీసివేసి దానిని డాక్టర్‌పై విసిరేయటమే కాకుండా వైద్యునిపై ఉమ్మి కూడా వేశాడు. ఆస్పత్రి సిబ్బందిని, ఇతర కరోనా బాధితులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు..

దీంతో ఆస్పత్రి సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయంటతో, పోలీసులు సదరు కరోనా రోగిపై హత్యాయత్నం (అటెంప్ట్ టూ మర్డర్) కేసు నమోదు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతను చేసింది చాలా తీవ్రమైన నేరమని పోలీసులు తెలిపారు.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులపై ఇలా అనుచితంగా ప్రవర్తిచడం సరికాదు.

doctoer