ఏప్రిల్ 14వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ మూడు రోజుల పాటు గురు, అంగారక, శని గ్రహాలు వరుసగా చంద్రునితో పాటు ఒకే వరుసలో (కక్ష్యలో కాదు) కనిపించనున్నాయి.
మన అనంత విశ్యంలో ఇదో అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 14, 15, 16వ తేదీలలో ఈ అద్భుత దృశ్యం వరుసగా మూడు రోజుల పాటు కనువిందు చేయనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాటిస్తున్న లాక్డౌన్ కారణంగా కాలుష్య స్థాయి కూడా తగ్గిన నేపథ్యంలో, ఇవి ఆకాశంలో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ ఉంటే ఇంకా స్పష్టంగా చూడొచ్చు.
సాధారణంగా రెండేళ్లకు ఒకసారి ఏప్రిల్ నెల మధ్యలో శని, గురు, అంగారక గ్రహాలు ఒకే వరుసలో కిపిస్తుంటాయి. కానీ ఈసారి చంద్రుడు కూడా ఈ వరుసలో చేరటం విశేషం.