అంతా అనుకున్నట్లుగానే దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3వ తేదీ వరకూ పొడగించారు. ఈమేరకు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో 19 రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ఇదివరకు ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ నేటి (ఏప్రిల్ 14వ తేదీ)తో ముగియడంతో పాటుగా దేశంలో కేసులు సంఖ్య ఇంకా పెరుగతూనే ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కరోనాపై పోరులో భారత్ ప్రజలు ఇప్పటివరకు అద్భుతంగా వ్యవహరించారని మరికొంత కాలం ఈ పోరును ఇలానే కొనసాగించాల్సిన అవసరం ఉందని, కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టడానికి లాక్డౌన్ను పొడగించడం, ప్రజలు సామాజిక దూరం పాటించడమే మన ముందున్న మార్గాలని ప్రదాని మోదీ తెలిపారు. ఇకపై లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయని చెప్పిన మోదీ, హాట్స్పాట్లపై ఎక్కువ దృష్టి పెడతామని చెప్పారు.