లాక్డౌన్ దెబ్బకు దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో కొందరికి ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. ప్రజలంతా టెలివిజన్, కంప్యూటర్, టాబ్లెట్స్, సెల్ ఫోన్స్ వంటి గ్యాడ్జెట్లకు అతుక్కుపోతున్నారు. టైంపాస్ కోసం కొందరు సినిమాలు చూస్తుంటే మరికొందరు మాత్రం అశ్లీశ వెబ్సైట్లను చూస్తున్నారు.
ఇదివరకెన్నడూ లేనంత ఎక్కువగా ఈ లాక్డౌన్ సమయంలో పోర్న్ చూస్తున్న వారి సంఖ్య పెరిగినట్లు ప్రముఖ పోర్న్ వెబ్సైట్ పోర్న్ హబ్ ప్రకటించింది. సాధారణ రోజుల్లో నమోదయ్యే ట్రాఫిక్ కంటే అదనంగా 18 శాతం ఎక్కువ ట్రాఫిక్ ఈ లాక్డౌన్ పీరియడ్లో నమోదైనట్లు సదరు కంపెనీ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా తమ వెబ్సైట్ ట్రాఫిక్ రికార్డులు సేకరించిన పోర్న్ హబ్ ఈ విషయాలను వెల్లడి చేసింది. భారత్ నుంచే అత్యధికంగా ట్రాఫిక్ వస్తున్నట్లు పేర్కొంది. ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐసీపీఎఫ్) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. లాక్డౌన్ తర్వాత పోర్న్ వెబ్సైట్లు చూడటం ఏకంగా 95శాతం పెరిగినట్లు తెలిపింది.