ఒబామా దెబ్బతో ట్రంప్ ఇంటికేనా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రానున్న ఎన్నికల్లో తన అధ్యక్ష పదవిని కోల్పోనున్నాడా..? ప్రస్తుత పరిస్థులను చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిత్యం విమర్శలు ఎదుర్కుంటూ, పలువురిపై విమర్శలు చేస్తూ ఉండే డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికాలో వ్యతిరేఖత ఎక్కువతున్నట్లు తెలుస్తోంది. కరోనాను కట్టడి, లాక్‌డౌన్, ప్రస్తుత పాలనా స్థితిగతులు, ఆర్థిక అసమానతలు వంటి విషయాల్లో ఇప్పటికే అమెరికా సర్కారు విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌కు రానున్న అధ్యక్ష ఎన్నికలు ఎంతో కీలకంగా మారనున్నాయి. మరోవైపు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా ఖరారైన మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌కు మద్దతుగా నిలబడటంతో ఇప్పుడు ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఓ ఉత్తమ అధ్యక్షునికి కావాల్సిన సకల సుగుణాలు జో బైడెన్‌కు ఉన్నాయని, అందుకే అతనికి మద్దతిస్తున్నాని ఒబామా చెప్పుకొచ్చారు.

ఓ మంచి నాయకునికి తెలివితేటలు, అనుభవం, నిజాయితీ, వినయం, దయ, కరుణ వంటి లక్షణాలు ఎంతో అవసరమని, ఇలాంటి వ్యక్తి రాష్ట్ర, మేయర్ కార్యాలయాకే పరిమితం కాకుడదని వైట్‌హౌస్‌కు వారి అవసరం ఎంతో ఉందని ఒబామా అన్నారు. జో బైడెన్‌కు ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, అధ్యక్షునిగా జో బైడెన్‌కు తన మద్దతు ప్రకటించడం తనకెంతో గర్వంగా ఉందని అన్నారు. గతంలో వీరిద్దరూ కలిసి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు నిర్వహించారు.

తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జో బైడెన్‌ను ఉపాధ్యుక్షునిగా ఎన్నుకోవటం తాను తీసుకున్న నిర్ణయాల్లో ఒక ఉత్తమమైన నిర్ణయమని, ఆ తర్వాత ఇద్దరి మద్య సాన్నిహిత్యం పెరిగిందని, ప్రస్తుతం అధ్యక్షుడికి కావల్సిన అన్ని లక్షణాలు జో బైడెన్‌లో ఉన్నాయని ఒబామా చెప్పారు. బైడెన్ ఎలక్షన్ క్యాంపైన్‌లో ఒబామా కీలకంగా మారారు. మరోవైపు బైడెన్ కూడా ఒకవేళ తాను అధ్యక్షుడిగా గెలిస్తే ఇదివరకు ట్రంప్ పాలన ఎలా ఉండేదో దానికి కొనసాగింపుగానే తన పాలన కూడా ఉండబోతుందని ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే, రానున్న రోజులు ట్రంప్‌కు గడ్డు కాలంగానే కనిపిస్తున్నాయనే చెప్పాలి.

trump-1

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s