కరోనాపై పోరుకు చిరంజీవి కుటుంబమంతా ఏకమైంది. గత కొద్ది రోజులుగా కరోనాపై అవగాహన కల్పించేందుకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పాటలు, వీడియోలు, పోస్టులు చేస్తున్న సంగతి తెలిసినదే. ఇందులో భాగంగానే తాజాగా.. చిరు కుటుంబ సభ్యులంతా కలిసి ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజల్లో కరోనాపై అవగాన కల్పించేందుకు ప్రయత్నించారు.
ఇంట్లో ఉంటాం.. యుద్ధం చేస్తాం.. క్రిమిని కాదు ప్రేమను పంచుతాం.. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం.. భారీతీయులం ఒక్కటై భారత్‌ని గెలిపిస్తాం.. స్టే హోమ్ స్టే సేఫ్.. అంటూ చిరంజీవి కుటుంబ సభ్యులంతా ప్లకార్డులను ప్రదర్శించారు.
వీరిలో చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్, ఉపాసన, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, చిన్న కూతురు శ్రిజతో పాటు మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు ఈ ప్లకార్డులను పట్టుకొని కనిపిస్తారు. కరోనా కట్టడి కోసం మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్స్ ఇప్పటికే భారీ విరాళాలు అందించిన సంగతి మనందరికీ తెలిసినదే.