దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించే ఇప్పటికే మూడు వారాలు గడచిపోయాయి. ఏప్రిల్ 14తో పోతుందనుకున్న లాక్డౌన్ దాదాపు మళ్లీ మరో మూడు వారాల పాటు పొడగించబడింది. ఈ లాక్డౌన్ పీరియడ్‌లో మద్యం దుకాణాలు మూసివేయటంతో ఇప్పటికే మందు బాబులు అనేక ఇబ్బందులు పడతున్నారు.
దొంగలుగా, పిచ్చివాళ్లుగా మారుతున్నారు. కొందరైతే ఏకంగా ఆత్మహత్యలే చేసుకుంటున్నారు. ఈ వ్యసనానికి బానిసలైన వారు మందు దొరక్క పోవటంతో విత్‌డ్రావల్ సిండ్రోమ్ అనే మానసిక సమస్యకు గురవుతున్నారు.
ఇదంతా అటుంచితే.. కొందరు స్మార్ట్ లిక్కర్ లవర్స్ మాత్రం ఇంట్లోనే మద్యం ఎలా తయారు చేసుకోవాలో అని అలోచిస్తున్నారు. ఆలోచించడమే కాదు దానికి సంబంధించిన రెసిపీని కూడా గూగుల్‌ని అడిగేస్తున్నారు.
అంతర్జాల దిగ్గజం గూగుల్ సెర్చ్ ఇంజన్లో ‘ఇంట్లోనే ఆల్కహాల్ తయారు చేసుకోవటం ఎలా’ (How To Make Alcohol At Home) అనే శోధన టాప్ ట్రెండ్స్‌లో ఒకటిగా ఉంది. మార్చి 22-28 తేదీల మధ్యలో ఈ సెర్చ్ టాపిక్ గూగుల్ ట్రెండ్స్‌లో టాప్‌లో నిలిచింది. చూశారా మందు బాబులు ఎంత తెలివి మీరిపోయారో.. ఈ సెర్చ్ రిజల్ట్స్‌ని ఆధారంగా చేసుకొని ఎంత మంది మందు బాబులు ఇళ్లలో ఆల్కహాల్ తయారీ చేపట్టారో మరి.