తెలుగు ప్రేక్షకులకు నయనతార గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలి నటనతో ప్రేక్షకుల మది దోచుకున్న నయనతార ఇదివరకు ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పుడు అతని పేరుని సగం ఇంగ్లీష్‌లో, మిగతా సగం తమిళంలో చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్న సంగతి మనందరికీ తెలిసినదే.
అయితే ఇప్పుడు ఆమె ఆ టాట్టూని చెరిపేసి కొత్త టాట్టూని వేయించుకుంది. ఈసారి మాత్రం ప్రియుడి పేరు కాకుండా పాత టాట్టూలో P లెటర్ని అలానే ఉంచేసి దానిని పాజిటివిటీ (Positivity)గా మార్చుకుంది. నయన్ కొత్త టాటూ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
శింబు, ప్రభుదేవాలతో ప్రేమ విఫలమైన తర్వాత నయన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పరస్పర విశ్వాసంలేని ప్రేమలు ఎక్కువ కాలం నిలబడలేవని తన విషయంలో అదే జరిగిందని, నమ్మకం లేని చోట కలిసి జీవిచడం కష్టమనే విడిపోయానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో డేటింగ్లో ఉన్న నయన్ త్వరలో అతనిని వివాహం చేసుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.