WHO విషయంలో ట్రంప్‌కు మొట్టికాయలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు నిధుల సరఫరాని నిలిపివేయడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇది విద్వేషాలకు సమయం కాదని, ఇలాంటి విపత్కర పరిస్థితులు మనుషులంతా ఏకమై కలిసికట్టుగా కరోనాతో పోరాడలని ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియా గుటెర్ర‌స్ తెలిపారు. యావత్ ప్రపంచం కరోనా వైర‌స్‌‌తో యుద్ధం చేస్తున్న త‌రుణంలో డ‌బ్ల్యూహెచ్‌వోకు కానీ లేదా ఏ ఇత‌ర యూఎన్ సంస్థ‌ల‌కు నిధుల‌ను త‌గ్గించ‌డం స‌రికాదని ఆయ‌న అన్నారు.

ట్రంప్ నిర్ణయం సరికాదు: చైనా
చైనా కూడా ఇదే విషయాన్ని ప్రస్థావించింది. కరోనా వైరస్‌ సంక్షోభ సమయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం ఆందోళనకరంగా పరిణమించిందని, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సామర్థ్యాలను బలహీనపరిచేలా ఉందని. కరోనా మహమ్మారిపై పోరులో అంతర్జాతీయంగా పరస్పర సహకారం అందించుకొనే అంశానికి విఘాతం కలిగించేలా ఉందని చైనా అధికారి జావో లిజియన్‌ అన్నారు.

ఇది చాలా ప్రమాదకర నిర్ణయం: బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా ఈ విషయంపై స్పందించారు. కరోనా మహమ్మారి వలన ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం నెల‌కొన్న స‌మ‌యంలో డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేయ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌రమైన చర్య అని వ్యాఖ్యానించారు. డ‌బ్ల్యూహెచ్ఓ నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్లనే కోవిడ్‌-19 వైరస్ వ్యాప్తి అదుపులో ఉంద‌ని, ఈ ఇప్పుడు సంస్థకు నిధులు నిలిపివేస్తే ఈ పనులు చేయటానికి వేరెవరూ ముందుకురారని బిల్ గేట్స్ అన్నారు.

trump-700

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s