ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా నేడు మరో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కి చేరింది. గడచిన 24 గంటల్లో 38 కేసులు నమోదయ్యాయి. వీటిలో కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు 6. అనంతపురం 5, చిత్తూరు 5, కృష్ణా 4 , గుంటూరు 4, కడప 1 పాజిటివ్ కేసులు చొప్పున నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 35 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 523 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గుంటూరు, కర్నూలు జిల్లాలలోనే అత్యధికంగా 126 కరోనా పాటిటివ్ కేసులున్నాయి. రాష్ట్రంలోని జిల్లాల వారీగా కేసులు వివరాలు ఇన్నాయి: