క‌రోనా కాల‌ర్ ట్యూన్ విసిగిస్తోందా..?

కరోనా వైర‌స్ ప‌ట్ల ప్రజల్లో అవగాన కల్పించేందుకు గాను ప్రభుత్వం అనేక రకాల ప్రచార మాద్యమాలను వినియోగిస్తోంది. ఇందులో భాగాంగానే టెలికాం ఆపరేటర్లతో చేతులు కలిపి, మనం ఎవరికైనా ఫోన్ చేసిన వెంటనే వినిపించేలా ఓ డిఫాల్ట్ కరోనా కాలర్ ట్యూన్‌ను రూపొందించింది.

మనం ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేస్తే, అవతలి వ్యక్తి ఫోన్‌కి రింగ్ రావడానికి ముందు కరోనా మెసేజ్ వినిపిస్తుంది. అవతలి వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసే వరకూ ఈ మెసేజ్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఏదైనా ఎమెర్జెన్సీ ఉండే కాల్ చేసినా లేదా వృత్తిరీత్యా మనం నిత్యం ఫోన్ కాల్స్ చేస్తున్న ఈ మెసేజ్ కాస్తంత ఇబ్బందిగానే అనిపిస్తుంది. మరి మనం ఫోన్ చేసినప్పుడు ఈ కరోనా కాల‌ర్ ట్యూన్ వినిపించ‌కుండా ఉండాలంటే అందుకు ఓ చిట్కా ఉంది.

అదేమిటంటే… మీకు ఎవరికైనా కాల్ చేసిన‌ తర్వాత వెంటనే కీప్యాడ్ ఓపెన్ చేసి నంబ‌ర్ 1ని ప్రెస్ చేయాలి. ఒకవేళ ఇది చేయకపోతే 1# ని కూడా ప్రెస్ చేయవచ్చు. ఇలా చేయటం వలన కరోనా కాలర్ ట్యూన్ ఆగిపోయి నేరుగా అవతలి వ్యక్తి ఫోన్ రింగ్ అవుతుంది. కానీ.. ఈ కరోనా మెసేజ్ మన మంచి కోసమేనని గుర్తుంచుకోండి, ఈ మెసేజ్ వినటం వలన మనకొచ్చే నష్టమేమీ లేదు, ఆపై మీ ఇష్టం.

dail-1

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s