కరోనా కట్టడి విషయంలో తెలంగాణా సర్కారు తీసుకుంటున్న ముందస్తు చర్యలు, అమలు చేస్తున్న విధివిధానాలపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ విషయంలో మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎప్పటికప్పుడు ప్రెస్మీట్లు నిర్వహిస్తూ ప్రజల మనో ధైర్యాన్ని పెంచడం, రైతులకు భరోసా ఇవ్వటం, కరోనా పట్ల అవగాహన కల్పించంలో చేస్తున్న ఆయన ప్రసంగాలను అందరూ మెచ్చుకుంటున్నారు.
తాజాగా.. సినీ నటుడు నాగబాబు కూడా ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పనితీరును ప్రశంసించారు. “ఈ మధ్య కేసీ మీటింగ్ లో ఆయన మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగింది. దేశం, రాష్ట్రం అల్లకల్లోలంగా వున్నప్పుడు ప్రజలకి నేనున్నాను అని ధైర్యం చెప్పి సమస్యలని పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు. ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎంలు ఉన్న దేశంలో కేసీఆర్ గారి లాంటి లీడర్స్ వజ్రల్లా మెరుస్తార’ని ట్వీట్ చేశారు.
ఈ మధ్య కేసీ మీటింగ్ లో ఆయన మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగింది.దేశం రాష్ట్రం అల్లకల్లోలంగా వున్నప్పుడు ప్రజలకి నేనున్నాను అని ధైర్యం చెప్పి సమస్యలని పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు.ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎం లు ఉన్న దేశం కేసీఆర్ గారిలాంటి లీడర్స్ వజ్రల్లా మెరుస్తారు. pic.twitter.com/EgEphmY76l
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 15, 2020
https://platform.twitter.com/widgets.js