ఎమ్‌టివి స్ల్పిట్స్‌విల్లా సీజన్ 12లో విజేతగా నిలిచిన ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియంవద కాంత్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అయ్యింది. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో అందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.
ఇందులో భాగంగానే, ప్రియంవద కాంత్ కూడా ఓ హాట్ ఫోటోను తన వాల్‌పై పోస్ట్ చేసి, మీ క్వరెంటైన్ సమయంలో ఎలా గడుస్తోందంటూ అభిమానులను అడుగుతోంది ఈ అందాల భామ.
డాన్స్అమేజ్ పేరుతో ప్రియంవద ఓ డాన్స్ అకాడెమీని నిర్వహిస్తోంది. ఈమె స్క్రిప్ట్స్ కూడా రాస్తుంటుంది,సేత్జీ అనే జీ టీవీ సిరియల్లో ఆమె స్క్రిప్ట్ డెవలప్ చేసింది. పలు హిందీ ఛానెళ్లలో ప్రియంవద కనిపిస్తుంటుంది.