ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న 97 మండలాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 97 మండలాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల నమోదును అనుసరించి రెడ్‌జోన్‌ మండలాలను ఖరారు చేసింది. మండల కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్లలో కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరోనా నివారణ చర్యలు తీసుకుంటారు.

మన రాష్ట్రంలో మొత్తం 676 మండలాలు ఉన్నాయి. రెడ్‌జోన్లలో 14 రోజులపాటు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్‌ జోన్‌ కింద ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి మరో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు ఒక్క కేసు కూడా నమోదు కాకుంటే అప్పుడు దానిని గ్రీన్‌జోన్‌ పరిధిలోకి పరిగణిస్తారు.

ప్రస్తుతం ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలిలా ఉన్నాయి:

కర్నూలు (17): కర్నూలు (పట్టణ), నంద్యాల, బనగానపల్లి గ్రామీణ, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు (పట్టణ), నందికొట్కూరు (పట్టణ), కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు (పట్టణ), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (పట్టణ)

నెల్లూరు (14): నెల్లూరు (పట్టణ), నాయుడుపేట (పట్టణ), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు (పట్టణ), కావలి (పట్టణ), కోవూరు, ఓజిలి, తోటపల్లిగూడూరు

గుంటూరు (12): గుంటూరు (పట్టణ), నరసరావుపేట, మాచర్ల (పట్టణ), అచ్చంపేట గ్రామీణ, మంగళగిరి (పట్టణ), పొన్నూరు (పట్టణ), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (పట్టణ)

పశ్చిమగోదావరి (9): ఏలూరు (పట్టణ), పెనుగొండ గ్రామీణ, భీమవరం (పట్టణ), తాడేపల్లిగూడెం (పట్టణ), ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు (పట్టణ), నరసాపురం (పట్టణ)

ప్రకాశం (9): ఒంగోలు (పట్టణ), చీరాల (పట్టణ), కారంచేడు, కందుకూరు (పట్టణ), గుడ్లూరు, కనిగిరి (పట్టణ), కొరిసపాడు, మార్కాపురం (పట్టణ), పొదిలి

తూర్పుగోదావరి (8): శంఖవరం గ్రామీణ, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (పట్టణ), రాజమండ్రి (పట్టణ), అడ్డతీగల, పెద్దాపురం (పట్టణ), రాజమహేంద్రవరం గ్రామీణ

చిత్తూరు (8): శ్రీకాళహస్తి (పట్టణ), తిరుపతి (పట్టణ), నగరి (పట్టణ), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు

కడప (7): ప్రొద్దుటూరు (పట్టణ), కడప (పట్టణ), బద్వేలు (పట్టణ), పులివెందుల (పట్టణ), మైదుకూరు (పట్టణ), వేంపల్లె, ఎర్రగుంట్ల (పట్టణ)

కృష్ణా (5): విజయవాడ (పట్టణ), పెనమలూరు గ్రామీణ, జగ్గయ్యపేట (పట్టణ), నూజివీడు (పట్టణ), మచిలీపట్నం (పట్టణ)

అనంతపురం (5): హిందూపురం (పట్టణ), అనంతపురం (పట్టణ), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు

విశాఖపట్నం (3): విశాఖ (పట్టణ), పద్మనాభం, నర్సీపట్నం (పట్టణ).

red-zone

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s