గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం సమీపంలో ఓ వృద్ధురాలు కరోనాతో మృతి చెందిన నేపథ్యంలో సీఎం నివాసం హాట్‌స్పాట్‌లో ఉందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ స్పందించారు. జగన్ నివాసం హాట్‌స్పాట్ జోన్లో లేదని క్లారిటీ ఇచ్చేశారు.
నాలుగు పాజిటివ్ కేసులున్న ప్రాంతం మాత్రమే హాట్‌స్పాట్‌లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలో ఒక్క కేసు మాత్రమే ఉన్నందున అది హాట్‌స్పాట్ పరిధిలోకి రాదని తెలిపారు.
కాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 44 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రం లోని నమోదైన మొత్తం 647 పాజిటివ్ కేసు లకు గాను 65 మంది డిశ్చార్జ్ కాగా, 17 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 565గా ఉన్నట్లు ఏపీ ఆరోగ్య శాఖ ఓ బులెటిన్ విడుదల చేసింది.