కరోనా కట్టడి విషయంలో గోవా సర్కారు అద్భుతంగా పనిచేస్తోంది. గోవాలో ఇప్పటి వరకూ కొత్తగా ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. దీంతో గోవా రాష్ట్రంలో కరోనా కేసులు జీరోకు పడిపోయాయి. గోవాలో చివరగా ఉన్న 7వ యాక్టివ్ కరోనా కేసు కూడా తాజా టెస్టుల్లో నెగెటివ్ రావటంతో ఆ రాష్ట్రంలో కేసులు పూర్తిగా శూన్యమయ్యాయి.
ఈ విషయంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. గోవాలో కొత్తగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, ఇదెంతో శుభపరిణామమని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు లేకపోయినప్పటికీ, కేంద్రం అదేశాల మేరకు గోవాలో మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని, ప్రజలు ఇందుకు సహరించాలని ఆయన కోరారు.
గోవాలో ఏప్రిల్ 3వ తేదీ ముందు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 7 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఏప్రిల్ 3కి ముందుకు పాజిటివ్‌గా తేలిన వారు కోలుకోవడంతో కేసులు జీరోకు పడిపోయాయి.