కరోనాతో మరణించిన 45 రోజుల చిన్నారి

భారతదేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. వయస్సుతో సంబంధం రోజుల వయస్సున్న పసికందుల నుంచి ముసలివాళ్ల వరకూ అందరూ కరోనాకు బలవుతున్నారు. తాజాగా.. ఢిల్లీలో 45 రోజుల వయస్సున్న ఓ చిన్నారిని కరోనా భూతం బలి తీసుకుంది.

భారత్‌లో నమోదైన కరోనా మరణాల్లో అత్యంత తక్కువ వయస్సున్న మరణం ఆ పాపదే కావటం విచారకరం. ఢిల్లీలోని కళావతి శరన్ చిన్నపిల్లల ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. పుట్టిన 45 రోజులకే ఆ పసికందు కాలం చేసింది. ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారమే ఈ పాప చనిపోయింది. కాకపోతే కరోనా టెస్ట్ ఫలితాలు రావడం ఆలస్యం అయ్యింది.

ఈ నేపథ్యంలో పాప మృతిపై నేడు ఢిల్లీ అధికారులు ఓ అధికారిక ప్రకటన చేశారు. పాప తండ్రి కరోనా పాజిటివ్ వచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి ద్వారానే బిడ్డకు కరోనా సోకిఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. కరోనాతో చనిపోయిన చిన్నారితోపాటుగా అదే ఆస్పత్రిలో మరికొంత మంది నవజాత శిశువులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తర్వాత వారందరినీ అక్కడినుంచి వేరే చోటుకి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

baby-700

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s