కెనడాలో కాల్పులు, 16 మంది మృతి

అమెరికా పొరుగు రాజ్యం కెనడాలో భారీ విషాధం నెలకొంది. ఓవైపు కరోనా మహమ్మారితో పోరాడే పనిలో అధికాలు బిజిగా ఉంటే, అదే తరుణంలో పోలీసు దుస్తులు ధరించిన ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటన నోవా స్కోటియాలోని చిన్న పట్టణంలోజరిగింది. శనివారం రాత్రి జరిగిన కాల్పుల సమయంలో ఒక మహిళా పోలీస్‌తో సహా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపారు.

పోలీసుల దుస్తుల్లో వచ్చిన నిందితుడు తాను ఉపయోగించిన కారు కూడా పోలీసు వాహనంలాగే మోడిఫై చేసుకున్నాడు. అదే కారులో పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడ్ని పోలీసులు వెంబడించి కాల్చి చంపారు. కెనడా 30 ఏళ్ల చరిత్రలో ఇంతటి దారుణమైన సంఘటన చోటు చేసుకోవటం, కాల్పుల్లో ఇంత భారీ ప్రాణాలు పోవటం ఇదే తొలిసారి.

కెనడాలో గత 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి కెనడాలో గన్ వాడకంపై కఠిన ఆంక్షలు విధించారు. తమ ప్రావిన్సుల చరిత్రలోనే అత్యంత హింసాత్మక ఘటనగా నోవా స్కాటియో గవర్నర్ స్టీఫెన్ మెక్‌నెయిల్ వ్యాఖ్యానించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ కాల్పులను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను అత్యంత భయంకరమైన పరిస్థితిగా ఆయన అభివర్ణించారు.

canada-700