బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో హఠాన్మరణం

బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో రుద్రతేజ్ సింగ్ ఇవాళ హఠాన్మరణం చెందారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇవాళ‌ ఉదయం కన్నుమూశారు. జర్మనీకి చెందిన ఈ లగ్జరీ కార్ బ్రాండ్ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు రుద్రతేజ్ సింగ్‌ను 2019లో బీఎండబ్ల్యూ సీఈవోగా నియమించారు.

రుద్రతేజ్ సింగ్ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. భారతదేశం అంతటా డీలర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలను అమలు చేస్తున్న సమయంలో ఆయన మరణం తమకు తీరని లోటని సంస్థ పేర్కొంది. సింగ్ కుటుంబానికి, ఆయన సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని తెలిజయజేసింది.

రుద్రతేజ్ సింగ్ 1996లో యూపీలో చిన్న ఏరియా సేల్స్ మేనేజర్‌గా జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత తన కెరీర్‌లో క్రమంగా ఎదుగుతూ వచ్చారు. హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీకి భారత్‌లో, అంతర్జాతీయ మార్కెట్లలోనూ 16ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవలు అందించారు. చివరగా రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్లోబల్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్‌గా, సీఈవోగా గత 8 నెలలుగా రుద్రతేజ్ సింగ్ పనిచేశారు.

bmw-ceo-700