ఇల్లు తుడుస్తూ.. దుమ్ము దులుపుతూ.. రాజమౌళి కష్టాలు!

rajamouli-700

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు తడిగుడ్డతో నేలను తుడుస్తూ, కిటికీలు తలుపులపై దుమ్మును దులుపుతూ కనిపించాడు. ఇందుకు కారణం అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విసిరిన ‘బీ ద రియల్‌మెన్‌’ #BetheREALMAN ఛాలెంజే కారణం.

లాక్‌డౌన్ సమయంలో బాగా తీరికగా ఉన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో వివిధ రకాల ఛాలెంజ్‌లను విసురుకుంటున్నారు. ఇందులో భాగంగానే సందీప్ రెడ్డి వంట సామాన్లు కడుగుతూ, ఇంటిని శుభ్రం చేస్తూ ఓ వీడియోని తీసి ‘బీ ద రియల్‌మెన్‌’ ఛాలెంజ్ పేరుతో ఎస్ఎస్ రాజమౌళికి ఓ ఛాలెంజ్ విసిరారు.

ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన రాజమౌళి కూడా ఇంటి పనులు చేస్తూ ఓ వీడియో తీసి మరికొందరు సెలబ్రిటీలకు ఛాలెంజ్ విసిరారు. రాజమౌళి ఛాలెంజ్ విసిరిన వారిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, యార్లగడ్డ శోభు, సుకుమార్, ఎమ్ఎమ్ కీరవాణిలు ఉన్నారు.

అంటే త్వరలోనే వీరు కూడా ఇంటి పనులు చేస్తూ కనిపించబోతున్నారన్నమాట. ఇంట్లోని పురుషులు ఈ లాక్‌డౌన్ సమయంలో స్త్రీలపై భారం వేయకుండా ఇంటి పనులలో పాలు పంచుకోవటమే ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యం.

https://platform.twitter.com/widgets.js

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s