కరోనా కట్టడి దృష్ట్ర్యా తెలంగాణాలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను తక్షణమే నిలుపదల చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసినదే. ఈనేపథ్యంలో, లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఆహారసరఫరా చేస్తున్న స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు కూడా లాక్డౌన్ ముగిసే వరకూ తెలంగాణా రాష్ట్రంలో మూతపడనున్నాయి.
అయితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆన్లైన్ ఫుడ్ డెలివరీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇందులో భాగంగానే స్విగ్గీ సంస్థకు ఏపి సర్కాలు అనుమతులు మంజూరు చేసింది. ఏపీలో ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు తమకు అవకాశమిచ్చినందుకు సంతోషంగా ఉందని, ఇందుకు గాను ఏపి సర్కారుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అవకాశం ఇచ్చినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు మరియు సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ట్విట్టర్లో పేర్కొంది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ విభాగం ద్వారా త్వరలో రాష్ట్రంలోని ప్రజలు పండ్లు, కూరయాగలను సరఫరా చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.