ఎవర్గ్రీన్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబుకు ఇవాళ (ఏప్రిల్ 20) చాలా స్పెషల్ అట. ఇంతకీ మహేష్‌కి ఈరోజున అంత స్పెషల్ కావడానికి కారణం ఏంటా అనుకుంటున్నారా ? ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా అమ్మకు శుభాకాంక్షలు తెలిపాడు. అమ్మతో ఉన్న ఫొటోను షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
మహేష్ బాబు తల్లి ఇందిర దేవి చాలా అరుదుగా బయట కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు. మహేష్ బాబుకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో తండ్రి కృష్ణ, విజయనిర్మల, సోదరుడు, సోదరీమణులు కనిపిస్తారు. కానీ తల్లి ఇందిర మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటారు. “ఏప్రిల్ 20 నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈ రోజు మా అమ్మపుట్టిన రోజు. హ్యాపీ బర్త్ డే అమ్మా” అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. త్వరలోనే ఈయన రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దుర్గ ఆర్ట్స్ బేనర్‌పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దానయ్య సినిమా అయిపోయిన తర్వాత కేఎల్ నారాయణ నిర్మాణంలో మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించారు. ఈ న్యూస్ కాస్త అఫీషియల్ కావటంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.
April 20!! A very special day of the most special person in my life… Happy birthday Amma❤️❤️❤️ pic.twitter.com/OuxWEN4q7x
— Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2020