ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంట విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ నేడు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో మార్చి 15వ తేదీ నుంచి చికిత్స పొందుతున్నారు.
ఆనంద్ సింగ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆదివారం సాయత్రం నుంచి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ ఉదయం 10:44 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ ప్రకటించింది. తండ్రి మరణించినట్లు సమాచారం అందే సమయానికి యోగి ఆదిత్యనాథ్ యూపీ రాజధాని లక్నోలో వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఉన్నారు.
తండ్రి మరణించిన వార్త తెలుసుకున్న అనంతరం యోగి ఈ సమావేశాన్ని రద్దు చేసుకొని హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ సాయంత్రానికి అనంద్ సింగ్ పార్థివ దేహాన్ని లక్నోకు తీసుకుని రావచ్చని తెలుస్తోంది. లక్నో లేదా వారణాశిలో అంత్యక్రియలను నిర్వహించే అవకాశం ఉనట్లు సమాచారం.
ఆనంద్ సింగ్ గతంలో ఫారెస్ట్ రేంజర్‌గా గతంలో పనిచేశారు. ఈయన ఆగస్టు 8,1948లో జన్మంచారు. ఆనంద్ సింగ్ బిస్త్‌కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో యోగి ఆదిత్యనాథ్ ఆనంద్ బిస్త్‌కు రెండవ కుమారుడు. యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్.