చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీ షియోమీ, తమ ఎమ్ఐ బ్రాండ్‌లో ఇప్పుడో అధునాతన ఉత్పత్తిని భారత మార్కెట్లో విడుదల చేసింది. మహిళలు, బ్యాచిలర్స్‌కు ఎంతగానో ఉపయోగపడే ఓ ఫ్లోర్ క్లీనింగ్ రోబోను కంపెనీ ప్రవేశపెట్టింది. ‘ఎమ్ఐ రోబో వ్యాక్యూమ్-మోప్ పి’ పేరు మార్కెట్లో విడుదలైన వ్యాక్యూమ్ క్లీనర్ ఫ్లోర్‌ను ఆటోమేటిక్‌గా వాక్యూమ్ చేయటంతో పాటు మాప్ కూడా చేస్తుంది.
ఈ రోబోలో ఉన్న లేజర్ డిటెక్ట్ సిస్టమ్ (ఎల్డీఎస్) సాయంతో ఇది నేలపై ఉండే ఆటంకాలను గుర్తిస్తూ, వాటిని గుద్దుకోకుండా తప్పించుకుంటుంది. ఎమ్ హోమ్ యాప్ సాయంతో దీనిని మన సెల్‌ఫోన్ సాయంతో కూడా ఆపరేట్ చేయవచ్చు. ఈ రోబోలో 12 పవర్ఫుల్ సెన్సార్లు ఉంటాయి. ఇవి రోబో చుట్టూ ఉండే పరిసరాలను గుర్తిస్తూ, ఆటంకాల నుంచి తప్పించుకునేలా చేస్తాయి.
భారత మార్కెట్లో ‘ఎమ్ఐ రోబో వ్యాక్యూమ్-మోప్ పి’ ఎమ్ఆర్పి ధరను రూ.29,999ను గా నిర్ణయించారు. అయితే, ప్రారంభ ఆఫర్ క్రింద్ ఇది రూ.17,999కే లభ్యం కానుంది. ఎవరైనా ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే నెలకు రూ. 2,999 చెల్లించి నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ క్రింద ఎలాంటి అదనపు వడ్డీ లేకుండా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఇది ఎమ్ఐ క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫాం ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది.