కరోనా కట్టడి విషయంలో సింగపూర్ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు జూన్ 1, 2020 వరకూ లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు పేర్కొంది. అయితే, సింగపూర్లో దేశవ్యాప్తంగా పాక్షిక లాక్డౌన్ మాత్రమే అమలులో ఉంది.
సింగపూర్లో జూన్ 1 వరకూ పొడగించిన ఈ పాక్షిక లాక్డౌన్లో భాగంగా భాగంగా, ఆ దేశంలోని అన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు మూతపడి ఉంటాయి. వాస్తవానికి మే 4, 2020వ తేదీ నాటికి ఈ లాక్డౌన్ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, కరోనాను పూర్తిగా నిర్మూలించాలంటే మరో నాలుగు వారాలు పాటు లాక్డౌన్ను పొడిగించక తప్పదనిసింగపూర్ ప్రధాని లీ లూంగ్ తెలిపారు.
సింగపూర్లో ఇప్పటి వరకూ 9,125 కరోనా కేసులు నమోదు కాగా.. వలస కార్మికుల ద్వారానే కొత్తగా 1,111 కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.