చిన్నోడికి పెద్దోడి ఛాలెంజ్.. కోబ్రాకి కూడా..

ఇంటి పనులలో ఆడవారికి సాయంగా మగవారిని భాగస్వామ్యం చేస్తూ సెలబ్రిటీలు మొదలు పెట్టిన ‘బీ ద రియల్‌మెన్‌’ #BetheREALMAN అనే సోషల్ మీడియా ఛాలెంజ్ అతికొద్ది సమయంలోనే బాగా వైరల్ అయ్యింది. చిరంజీవి, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లతో అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ వీడియోలను షేర్ చేస్తున్నారు.

తాజాగా.. విక్టరీ వెంకటేష్ కూడా తన ఛాలెంజ్‌ను పూర్తి చేసి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. వెంకటేష్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్‌ను విసిరారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వెంకటేష్ పోస్ట్ చేసిన వీడియోలా మన హీరో ఇళ్లు మాప్ చేస్తూ, లాన్‌లో గడ్డి కత్తిరిస్తూ, మొక్కలను ట్రిమ్ చేస్తూ, చెట్లకు నీళ్లు పడుతూ, మిక్స్డ్ వెజిటెబల్ కూర చేస్తూ చివరకు పాటియోలో కూర్చుని నిసర్గదత్త మహరాజ్ రచించిన ఐ యామ్ దట్ (I Am That) అనే ఫిలాసఫీ బుక్ చదువుతూ కనిపిస్తారు.

మన కుటుంబ పనులలో సాయం చేస్తూ నిజమైన మగాళ్లం అనిపించుకుందాం అంటూ వెంకటేష్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత బీ ద రియల్‌మెన్‌ ఛాలెంజ్ కోసం చిన్నోడు మహేష్ బాబుని, కోబ్రా వరుణ్ తేజ్‌ని మరియు ఎఫ్ 2 డైరెక్టర్ అనీల్ రావిపూడిని నామినేట్ చేస్తున్నట్లు వెంకటేష్ ట్వీట్టర్లో పేర్కొన్నారు.

venkatesh-mahesh

venkatesh-varuntej

https://platform.twitter.com/widgets.js

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s