తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో పాటిస్తున్న లాక్డౌన్ సత్ఫలితాలనిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణాలో ఇవాళ (ఏప్రిల్ 25) మొత్తం 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
ఈ మొత్తం 7 కేసుల్లో 6 కేసులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నమోదు కాగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. తాజా కేసులతో కలుపుకొని తెలంగాణాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 990కి చేరింగి. వీరిలో 307 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 658 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని అధికారులు వివరించారు.