టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ భారత్‌లోని తమ కస్టమర్ల కోసం ఓ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో, వారికి వినోద సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సేవలను ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా అందించేలా రూ.401 రీచార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.
ఎయిర్టెల్ కస్టమర్లు రూ.401 తో రీఛార్జ్ చేసుకుంటే సంవత్సరం పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విఐపి సేవలను ఉచితంగా పొందవచ్చు. సాధారణంగా ఈ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాలంటే 399 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే ఎలాంటి అదనపు డబ్బు చెల్లించకుండానే ఉచితంగా ఈ సేవలను సంవత్సరం పాటు పొందవచ్చు.
అంతే కాకుండా.. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న ఎయిర్టెల్ కస్టమర్లకు రోజుకి 3 జీబి మొబైల్ డేటా చొప్పున 28 రోజులపాటు డేటా బెనిఫిట్ కూడా లభ్యం కానుంది. కాకపోతే ఈ ప్లాన్‌లో వాయిస్ కాలింగ్ లేదా ఎస్ఎమ్ఎస్ వంటి బెనిఫిట్స్ మాత్రం ఉండవు.