కరోనా కట్టడి కోసం చేస్తున్న లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు ఆర్ధిక సాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు.
రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయారని, వారిని ఆదుకునేందుకు కార్మికులకు రూ.10 వేల ఆర్థిక సహాయం ఇవ్వటంతో పాటుగా, చంద్రన్న బీమాను పునరుద్ధరించటం మరియు వారి జీవన భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లోకేష్ సర్కారుని డిమాండ్ చేశారు.
ఈ ఏడాది భవన నిర్మాణ రంగం ఇసుక సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే, తాజా లాక్డౌన్ వల్ల ఏర్పడిన పరిస్థితులతో ఆ రంగంలో పనిచేసే కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. కార్మికులకు అందుబాటులో ఉన్న రూ. 1900 కోట్ల బిల్డింగ్ సెస్ వారి సంక్షేమానికే ఖర్చు చేయాలి కోరారు.