కిమ్ బ్రతికే ఉన్నాడు, ఆ వార్తలన్నీ ఫేక్

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని రోజులుగా పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసినదే. గత వారం ఆరంభంలో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిదని వార్తలు రాగా, వారంతంలో ఆయన చనిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. కిమ్ తర్వాత ఆయన చెల్లెలు అధ్యక్ష పదవి చేపడుతుందనే వార్తలు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై, ఆయన మరణంపై వస్తున్న వార్తలన్నీ అవాస్థవాలని వారి శత్రుదేశమైన సౌత్ కొరియా ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. సౌత్ కొరియా అధ్యక్షుడి భద్రతా సలహాదారు మూన్ చుంగ్ ఇన్ తెలిపిన వివరాల ప్రకారం, కిమ్ బ్రతికే ఉన్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.

తమ ప్రభుత్వం అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడూ నిశితంగా గమనిస్తోందని, ఉత్తర కొరియాకు తూర్పు ప్రాంతమైన వాన్‌సన్‌లో కిమ్‌ ఏప్రిల్‌ 13 నుంచి చికిత్స పొందుతున్నారని చుంగ్‌ ఇన్‌ తెలిపారు. ఇక అతని ఆరోగ్యం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా ఎలాంటి అనుమానాస్పద కదలికలు లేవని స్పష్టం చేశారు. గత ఏప్రిల్ 11 నుంచి కిమ్ బయట ప్రపంచానికి కనిపించలేదు. కాగా.. కిమ్ జాంగ్ ఉన్ విషయంలో నార్త్ కొరియా ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

kim-700

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s