సోషల్ మీడియాలో రోజుకో విచిత్రమైన ఛాలెంజ్‌లు పుట్టుకొస్తున్నాయి. సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితం కావడంతో కొత్త కొత్త ఛాలెంజ్‌లను పుట్టిస్తున్నారు. ఇప్పటికే, మగవారు కూడా ఇంట్లో పనులను చేయాలంటూ బి ది రియల్‌మ్యాన్ ఛాలెంజ్ వైరల్ కాగా తాజాగా ‘పిల్లో ఛాలెంజ్’ అంటూ కొత్త ఛాలెంజ్ ఒకటి పుట్టుకొచ్చింది.
ఈ పిల్లో ఛాలెంజ్‌లో పాల్గొనే వారు వంటిపై దుస్తులకు బదులుగా పిల్లో (దిండు)ను కప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ కాస్తా మన మిల్కీ బ్యూటీ తమన్నాను తాకింది. పిల్లో ఛాలెంజ్ అందుకున్నదే తడవుగా తమన్నా ఒంటిమీద బట్టలకు బదులుగా పిల్లో కప్పుకొని ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.
మరో బాలీవుడ్ సెలబ్రిటీ పాయల్ రాజ్‌పుత్ కూడా ఇలాంటి చాలెంజ్‌నే స్వీకరించి పిల్లోతో తీసుకున్న ఫొటొని విడుదల చేసింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోలు లాక్డౌన్ వల్ల ఖాలీగా నెటిజెన్లకు మంచి విందునే ఇస్తున్నాయని చెప్పాలి. ఈ ఫొటోలను ట్రోల్ చేసే వాళ్లు, కామెంట్స్ చేసేవాళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. సోషల్ ట్రెండ్స్‌లో కూడా ఇవి టాప్‌లో నిలిచాయంటే వీటి గురించి నెటిజెన్లు ఎంతలా మాట్లాడుకుంటున్నారో అర్థం చేసుకోవాలి.