ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కరోనా కట్టడిలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను అడ్డుకునేందుకు రోడ్డుపై ఏకంగా గోడలు నిర్మించేశారు. ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది. చిత్తూరు జిల్లా నుండి తమిళనాడును కలిపే మూడు ప్రాంతాల్లో రోడ్లపై రాత్రికి రాత్రే గోడలను నిర్మించేశారు.
తమిళనాడు రాష్ట్రం వేలూరు కలెక్టర్ ఆదేశాల మేరకే గోడలు నిర్మించామంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో స్థానికులకు తమిళనాడు కార్మికులకు మద్య వాగ్వివాదం తలెత్తింది. చిత్తూరు జిల్లా స్థానికులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సరిహద్దుల పహారాను పెంచాలి కానీ, ఇలా పూర్తిగా రాకపోకలను అడ్డుకుంటూ గోడ కట్టడం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలోనే తమిళనాడు వాసులు ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.