అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, కొత్త అధ్యక్షుడి కోసం జరగనున్న ఎన్నికలను వాయిదా వేయబోమని, ఇదివరకు నిర్ణయించిన తేదీ ప్రకారమే నిర్వహిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించిన ట్రంప్ సోమవారం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఓ మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్లో మార్పులు ఉంటాయా? అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ, ముందుగా నిర్ణయించిన ప్రకారం నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
కాగా.. దేశంలో కరోనా వైరస్ ప్రభలత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేస్తున్న జో బైడెన్ ఇటీవల ఓ సందర్భంలో డొనాల్డ్ ట్రంప్‌ను డిమాండ్ చేసిన సంగతి తెలిసినదే.