ఫోన్ కొట్టు.. మ్యాంగో పట్టు..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో.. జంట నగర వాసులకు తెలంగాణా సర్కార్ ఓ బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రజల ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండానే, తమకు నచ్చిన మామిడి పండ్లను డోర్ డెలివరీ చేయించుకోవచ్చు. పోస్టాఫీసుల ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ఉద్యాన శాఖ.

ఈ మేరకు తపాలాశాఖతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ ఉద్యాన శాఖ, వినియోగదారులు కోరిన పండ్లను 4 నుంచి 5 రోజుల లోపుగా ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా, సాంప్రదాయ పద్ధతిలో మగ్గించిన స్వచ్ఛమైన మామిడి పండ్లను అట్టపెట్టెలో పెట్టి కస్టమర్లకు అందజేస్తారు.

కనీసం 5 కిలోలు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది, ఈ బుట్టలో సుమారు 12-15 వరకూ పండ్లు ఉంటాయి. ఎక్కువ కావాలనుకునే వారికి కూడా డెలివరీ చేస్తారు. ఇందుకు వినియోగదారులు చేయాల్సిందల్లా ఏ రకం పండ్లు కావాలి, ఎన్ని కిలోలు కావాలనే విషయాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేయటమే. రైతుల దగ్గర అందుబాటులో ఉండే రకాలు, క్వాంటిటీని బట్టి ధరలు మారుతూ ఉంటాయి.

mango

ఎలా ఆర్డర్ చేయాలి?
మామిడి పండ్లు డోర్ డెలివరీ కావాలనుకునే వారు, ఏ రకం ఎన్ని కిలోలు అనే విషయాన్ని ఈ 7997724925, 7997724944 ఫోన్ నంబర్లకు కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి పొందవచ్చు. ఈ ఫోన్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే మాత్రమే అందుబాటులో ఉంటుంది. పండ్ల డెలివరీ వినియోగదారులు తమ పూర్తి చిరునామా, పిన్‌కోడ్‌ నెంబరుతో పాటు ఫోను నెంబరును కూడా వాట్సాప్ చేయాల్సి ఉంటుంది.

ఎలా పేమెంట్ చేయాలి?
గూగుల్‌ పే, ఫోన్‌పే ద్వారా నగదు చెల్లించాలనుకునేవారు 7997724925 నంబరును వినియోగించాలని తెలంగాణ ఉద్యాన శాఖ సూచించింది. బ్యాంక్‌ ఖాతా ద్వారా చెల్లించాలనుకునే వారు 013910100083888 అకౌంట్ నెంబర్, IFSC Code: ANDB0000139 లను ఉపయోగించి ఆంధ్రాబ్యాంక్‌, గగన్‌మహల్‌ శాఖలో జమ చేసి కన్ఫర్మేషన్‌ను పంపాల్సి ఉంటుంది.

ప్రస్తుతం 5 కిలోల బంగినపల్లి మామిడి పండ్ల బాక్సు ధరను పోస్టాఫీసు డెలివరీ చార్జీలతో కలిపి రూ.350గా నిర్ధారించారు. మే 1, 2020వ తేదీ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s