బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కొలోన్ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న 53 ఏళ్ల ఇర్ఫాన్ ఖాన్ నేడు (ఏప్రిల్ 29)న తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా పెద్దప్రేగు సంబంధిత వ్యాధితో ఇర్ఫాన్ బాధపడుతున్నారు. ఇటీవలే (ఎప్రిల్ 25న) ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం కూడా మరణించారు. వరుస మరణాలతో ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం శోఖ సంద్రంలో మునిగిపోయింది.