బాలీవుడ్‌కు మరో షాక్: రిషీ కపూర్ కన్నమూత

బాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ మీద షాక్ తగులుతోంది. స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త నుండి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి, ప్రముఖ సీనియర్ నటుడు రిషీ కపూర్‌ (67) కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. గత 2018 నుంచి రిషీ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు.

అప్పటి నుంచి ఆయన అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో దాదాపు ఓ సంవత్సరం పాటు చికిత్స చేయించుకున్నారు. రిషీ కపూర్‌కు ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ చేర్పించారు. ఆయ‌న మృతికి సంబంధించిన విష‌యాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్వీట్ లో తెలిపారు.

అంతేకాదు ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరారు. 1970లలో సెన్సేషనల్ హిట్ చిత్రం బాబీతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన రిషీ కపూర్ లెజెండరీ హీరో, డైరెక్టర్ రాజ్ కపూర్‌కు రెండవ కుమారుడు. ఇక రిషి కపూర్ సినిమాల విషయానికి వస్తే ఆయన ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా ది బాడీ అనే సినిమాలో కూడా ఆయన నటించారు.

rishi