సమ్మర్లో ఎక్కవగా కనిపించే డ్రింక్ ఫలూడా. వాస్తవానికి ఫలూడా సేవించడానికి సీజన్ అవసరం లేదు. దీనిని ఎప్పుడైనా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందుకు మనకు కావల్సిందల్లా ఫలూడా సీడ్స్ (సబ్జా గింజలు). మరి సింపుల్‌గా తయారయ్యే పాల సేమియా ఫలూడాని ఎలా చేయాలో తెలుసుకుందాం రండి..!
కావల్సిన పదార్థాలు:
సేమియా/వెర్మిసెల్లి – 1 కప్పు
పాలు – 2 కప్పులు
ఫలుడా సీడ్స్/సబ్జా గింజలు – టేబుల్ స్పూన్స్
పంచదార – తీపికి సరిపడా
నెయ్యి – టేబుల్ స్పూన్
యాలకుల పొడి లేదా వెనీలా ఎసెన్స్ – కొంచెం
తయారు చేసే విధానం:
ఫలూడా తయారు చేయటానికి రెండు గంటల ముందుగా సబ్జా గింజలను పంచదార కలిపిన నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌పై మూకుడు పెట్టుకొని అందులో కొంచెం నెయ్యు వేసి, సేమియాని బాగా దోర రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి.
సేమియా వేగిన తర్వాత అందులో పాలు పోసి మరిగించాలి. ఇందులో తీపికి సరిపోయేటట్లుగా పంచదారను కలుపుకోవాలి. మనం ఇదివరకే ఫలూడా సీడ్స్‌ని పంచదారలో నానెబట్టుకున్నాం కాబట్టి, ఇందులో కొంచెం పంచదార వేసుకుంటే సరిపోతుంది.
పాలలో సేమియా బాగా ఉడికందని నిర్ధారించుకున్న తర్వాత, ఫ్లేవర్ కోసం ఇందులో యాలకుల పొడిని కాానీ లేదా వెనీలా ఎసెన్స్‌ని కానీ చేర్చుకొని, స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత ఇందులో ఫలూడా సీడ్స్‌ని చేర్చి ఫ్రిడ్జ్‌లో ఉంచుకొని చల్లగా సర్వ్ చేసుకోవాలి.
సబ్జా విత్తనాలు శరీరంలోని వేడిని తగ్గించడంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది.