ఒరిజినల్ బాలీవుడ్ చాక్లెట్ బాయ్, నట దిగ్గజం రిషి కపూర్ మరణ వార్త అన్ని భాషల సినీ పరిశ్రమను కలచి వేస్తోంది. గత 2018 నుంచి క్యాన్సర్తో పోరాటం చేస్తున్న రిషి కపూర్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో, తారలంతా ఆన్లైన్ ద్వారానే ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రిషి కపూర్ మృతి పట్ల తాజాగా ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని వెల్లడించారు.
ఈ వార్త విని తనకు గుండె పగిలినంత పని అయిందని, తన ప్రియమైన స్నేహితుని ఆత్మకి శాంతి కలగాలని ట్విట్టర్ ద్వారా రజనీకాంత్ తన సంతాపం వ్యక్తం చేశారు.
Heartbroken … Rest In Peace … my dearest friend #RishiKapoor
— Rajinikanth (@rajinikanth) April 30, 2020