అటుగా వచ్చిన సందేశం.. ఇటుగా నన్ను బాధిస్తుంది.. 

poem-1

అటుగా వచ్చిన సందేశం              1
ఇటుగా నన్ను బాధిస్తుంది..         2      పల్లవి

నిన్నటి కలవో తెలియదు,
నేటి నిజానివో  తెలియదు,
రేపటి భవిష్యత్తువో తెలియదు.
నా జీవిత లక్ష్యానివో తెలియదు…     అటుగా 1, 2

తొలకరి జల్లులు కురుస్తుంటే,
బాల్యం బరువవు తుంటే,
యవ్వనం వెక్కిరిస్తుంటే,
వేసిన పైటే  ఎగిరిపోతానంటే,
నీ ద్యాసలో,  నే తడుస్తుంటే ,             అటుగా  1, 2

సొగసన్నది బరువాయే,
మనసన్నది పడిపోయే,
మరుపన్నది  రాదాయే,
నిదురన్నది కరువాయే,          
నీ ధ్యాసే నాకు శరణాయే                   అటుగా 1, 2  

పరువం పైకెగిసినవేలా,
తొలిచూపులు  కలిసినవేళ,
విరహం వేధిస్తున్న వేళ,
సరసానికి సిద్దమైన వేళ,
మరుసటి రోజును మరిచినవేళ,
తనువే నీ అర్పించిన వేళ.                   అటుగా  1, 2

పారాణే ఆరలేదు,
తొలి నాడే మరువలేదు,
కోరికైనా తీరలేదు,
విధిరాతే మారలేదు,
ఏమైందో తెలియలేదు, 
ఇటు మాత్రం నువ్ రాలేదు                   అటుగా  1, 2

విధి ఆడిన నాటకమా !
లేక, ఇదియే నా జాతకమా !
నీవన్నది కల అయితే, !
నేనన్నది నిజమవునా !                      అటుగా  1, 2

అలుపెరుగనిపోరాటం లో,  గెలుపేరుగని ఒంటరినై,
నిజ జీవిత చక్రంలో, నీ జ్ఞాపకాల బానిసనై.
నీవు లేని లోకంలో,
నీ విచ్చిన  బంధంతో, 
జీవిస్తా నీ తుది కోరికనై…….            అటుగా  1, 2

ఈ రచన భర్త లేని లోకంలో, భవిష్యత్ ని గడిపే  స్త్రీ జాతికి  అంకితం

                       ఇట్లు
ధేనువుకొండ వెంకట హనుమ వేణు కుమార్
S/o ధేనువుకొండ తిరుమల శ్రీనివాసరావు
బుచ్చిరెడ్డిపాళెం,  నెల్లూరు జిల్లా, 9885484119

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s