ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1463కు చేరింది. కర్నూలు జిల్లాలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి, కర్నూలులో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 400 దాటిపోయింది.
ఏపీలో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 403కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో రెండు కోవిడ్ మరణాలు సంభవించాయని, దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 33కు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 1,027 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ వివరించింది.
ఏపీలో జిల్లాల వారిగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
కర్నూలు జిల్లా – 411
గుంటూరు జిల్లా – 306
కృష్ణా జిల్లా – 246
నెల్లూరు జిల్లా -84
చిత్తూరు జిల్లా – 80
కడప జిల్లా -79
అనంతపురం జిల్లా -67
ప్రకాశం జిల్లా – 60
పశ్చిమ గోదావరి జిల్లా – 58
తూర్పుగోదావరి జిల్లా – 42
విశాఖపట్నం జిల్లా -25
శ్రీకాకుళం జిల్లా – 5