శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వాయిదా

తిరుమలలో ప్రతియేటా జరిగే శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను, లాక్‌డౌన్ కారణంగా టీటీడీ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ ఉత్సవాలు మే 1 నుండి 3వ తేదీ వరకు జ‌ర‌గాల్సి ఉంది. కోవిడ్ -19 వ్యాప్తిని అడ్డుకునేందుకు గాను దేశవ్యాప్తంగా మే 17 వరకూ లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ ఉత్సవాలను ప్రస్తుతానికి వాయిదా వేశారు.

ఈ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ఎక్కువ సిబ్బంది అవ‌స‌ర‌మవుతార‌ు. తొలుత శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల‌కు బ‌దులుగా శ్రీ‌వారి ఆల‌యంలోనే ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించినప్పటికీ, అనూహ్యంగా లాక్‌డౌన్ మరో రెండు వారాల పాటు కేంద్రం పొడగించడంతో వేరే మార్గం లేక వాయిదా వేయాల్సి వచ్చిందని టీటీడీ పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించడం అసాధ్యమని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామివారు, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు, ఆగ‌మ స‌ల‌హాదారుల సూచ‌న‌ల మేర‌కు లాక్‌డౌన్ త‌రువాత మ‌రో తేదీల్లో ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. ఈ ఉత్స‌వాలకు సంబంధించిన తదుపరి తేదీలనీ టీటీడీ లాక్‌డౌన్ అనంతరం ప్రకటించే ఆస్కారం ఉంది.

ttd-7

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s