లాక్డౌన్ 3.0 సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు, తెలంగాణా రాష్ట్రంలో నేటి నుంచి కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే, మద్యం అమ్మకాలు నిలిచిపోయిన కారణంగా వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు లిక్కరు ధరలను తెలంగాణా సర్కారు కూడా పెంచేసింది.
ఇందులో భాగంగానే, చీప్ లిక్కర్‌పై మాత్రం 11 శాతం, ఇతర బ్రాండ్లపై 16 శాతం ధరలను పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.. లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా ఇవే రేట్లు కొనసాగుతాయని ఆయన వివరించారు. ప్రస్తుతం తెలంగాణాలో పెరిగిన మద్యం ధరలు ఇలా ఉన్నాయి:
🍾 ప్రతి బీర్‌పై రూ. 30 పెంపు
🍾 చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ. 40 పెంపు
🍾 ఆర్డినరి లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ. 80 పెంపు
🍾 ప్రీమియం లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ. 120 పెంపు
🍾 స్కాచ్ లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ. 160 పెంపు