తెలంగాణ రాష్ట్రంలో అన్ని జోన్లలో (గ్రీన్, ఆరెంజ్, రెడ్) మద్యం అమ్మకాలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మందుబాబుల ఆనందం కట్టలు తెచ్చుకుంది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని జోన్లలో కూడా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే మందుబాబులు మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. తెలంగాణాలోని ఓ ప్రాంతంలో కనిపించిన దృశ్యం ఇది.
రాష్ట్రంలో మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరచి ఉంటారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ మద్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మాస్కు లేకుండా వచ్చిన వారికి మద్యం విక్రయించరు. మద్యం ధరలను కూడా పెంచారు. చీప్ లిక్కర్‌పై మాత్రం 11 శాతం, ఇతర బ్రాండ్లపై 16 శాతం ధరలను పెంచారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా ఇవే రేట్లు కొనసాగుతాయి.