కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం చేపట్టిన లాక్డౌన్ కారణంగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసినదే. అయితే, అనూహ్యంగా ఈ లాక్డౌన్ వరుసగా మూడు సార్లు దాదాపు రెండు నెలల పాటు పొడగించిన నేపథ్యంలో, ఇకపై టెన్త్ ఎగ్జామ్స్‌ను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై సర్వత్రా సందిగ్ధత నెలకొంది.
ఈ నేపథ్యంలో, దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ (CBSE) సిలబస్‌ను ఫాలో అయ్యే విద్యాసంస్థలు నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఓ కీలక ప్రకటన చేశారు. కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి పెండింగ్‌లో ఉన్న పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించబోమని ఓ ట్వీట్లో తెలిపారు.
కాకపోతే, ఈశాన్య ఢిల్లీకి చెందిన విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా పరీక్షలు రాయాలని స్పష్టం చేశారు. ఈ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు గాను 10 రోజుల సమయం ఇస్తామని తెలిపారు.
📢Attention class X students!
No examination to be held for class X students nationwide, except for students from North-East Delhi.An adequate time of 10 days will be given to all students for the preparation of exams.#EducationMinisterGoesLive pic.twitter.com/xjj7qszUZZ
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 5, 2020