టాలీవుడ్ సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా నిన్న సాయంత్రం గుండెపోటుకి గురయ్యారు. ఆ విషయాన్ని గమనించిన ఆయన కుటుంబ సభ్యులు వెంటనే రాజాను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.
ప్రస్తుతం శివాజీ రాజా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా బీపీ తగ్గిపోవడంతో గుండెపోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ఆయనకు శస్త్ర చికిత్స చేసి స్టంట్ వేసే అవకాశం ఉందని వెద్యులు పేర్కొన్నట్టు సురేష్ కొండేటి తెలిపారు. ఆయన శివాజీ రాజాతో ఫోన్లో మాట్లాడినట్టు స్పష్టం చేశారు.